'వకీల్ సాబ్' బెనిఫిట్ షో టిక్కెట్ రూ. 1500!

'వకీల్ సాబ్' బెనిఫిట్ షో టిక్కెట్ రూ. 1500!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ 'వకీల్ సాబ్' విడుదలకు ముందే సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. మరికొద్ది గంటల్లో ఈ మూవీ ట్రైలర్ ను రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన థియేటర్లలో ప్రదర్శించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ మూవీకి అమెరికాతో మొదలు పెట్టి ప్రపంచవ్యాప్తంగా బెనిఫిట్ షోస్ ను ప్లాన్ చేస్తున్నారు. విదేశాల్లో టిక్కెట్ రేట్ సంగతి ఎలా ఉన్నా... మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ షో టిక్కెట్ ధర అధికారికంగానే రూ. 1500 పెట్టాలని అనుకుంటున్నారట. ఏపీలో ముందు రోజు రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో ప్రదర్శన జరిగేలా అనుమతులు పొందుతున్నారట. కానీ తెలంగాణాలో మాత్రం 9వ తేదీ ఉదయం ఆరు గంటలకు పడుతుందని అంటున్నారు. అలానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 'వకీల్ సాబ్' టిక్కెట్ రేట్లు పెంచుకునేలా నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటికే ఈ విషయంలో రెండు ప్రభుత్వాలూ జీవోలను సైతం విడుదల చేయడంతో టిక్కెట్ ధర రూ.300 నుండి రూ. 500లకు మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తానికి లేటుగా వస్తున్నా లేటెస్ట్ ధరలతో పవన్ స్టార్ బాక్సాఫీస్ ను కొల్లగొట్టడం ఖాయమనిపిస్తోంది.