దీపావళికి పవన్ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా .?

దీపావళికి పవన్ సినిమా నుంచి అప్డేట్ వస్తుందా .?

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ 'వకీల్‌ సాబ్'.. ప్రస్తుత షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్‌. బోని కపూర్, దిల్ రాజు కలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో మొదలు పెట్టింది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాలో భాగంగా వచ్చే ఒక సన్నివేశంలో కోర్టులో లాయర్ గా వాదిస్తాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమానుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమో అని అభిమానులంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక దీపావళి కానుకగా వకీల్ సాబ్ నుంచి టీజర్ వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని కనుక దీపావళికి ఖచ్చితంగా టీజర్ ను వదిలే అవకాశం ఉందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. దీపావళికి కనీసం పోస్టర్ కాని టీజర్ కాని వస్తుందా రావడం లేదా అంటూ ఫ్యాన్స్ నెట్టింట దర్శక నిర్మాతలను ప్రశ్నిస్తున్నారు. కానీ మేకర్స్ మాత్రం స్పందించడం లేదు. చూడాలి మరి ఎం జరుగుతుందో..