దుమ్మురేపుతున్న వకీల్ సాబ్... 

దుమ్మురేపుతున్న వకీల్ సాబ్... 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమా వకీల్ సాబ్.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 90శాతానికి పైగా పూర్తి చేసుకుంది.  కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.  అయితే, ఈరోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ వకీల్ సాబ్ కు సంబంధించిన మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.  ఒక చేతిలో క్రిమినల్ లా పట్టుకొని, మరొక చేతిలో క్రిమినల్స్ ను తరిమి కొట్టేందుకు బేస్ బాల్ బ్యాట్ పట్టుకొని సీరియస్ లుక్ తో కూడిన పోస్టర్ ను యూనిట్ రిలీజ్ చేసింది.  ఈ మోషన్ పోస్టర్ ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్నది.  శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.