మనసారా వినువారెవరూ: ‘మగువా.. మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది

మనసారా వినువారెవరూ: ‘మగువా.. మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘వకీల్‌సాబ్’ ఏప్రిల్ 9న విడుదలై బ్లాక్‌బస్టర్ టాక్‌ సొంతం చేసుకొని థియేటర్లలో దూసుకుపోతుంది. వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మించారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటించగా.. నివేదా థామస్, అంజలి, అనన్య, ప్రకాశ్ రాజ్‌లు కీలక పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. తాజాగా ‘మగువా.. మగువా’ పాట.. ఫీమేల్ వర్షన్‌ని లిరికల్ వీడియోని విడుదల చేశారు. ‘ఆకాశం తాకే నీ ఆక్రందనలు మనసారా వినువారెవరూ’ అంటూ మహిళలు ఈ సమాజంలో ఎదురుకుంటున్న కష్టాలను కళ్లకు కట్టినట్లుగా ఈ పాటలో చూపించారు.