బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన వంశీ

బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన వంశీ

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీలో చేరుతారని నిన్నటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డిని వంశీ కలవడంతో ఆయన బీజేపీలో చేరడం దాదాపు ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ వ్యవహారంపై ఇవాళ వంశీ క్లారిటీ ఇచ్చారు. టీడీపీని వీడాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. తానెప్పుడూ చంద్రబాబుకు విధేయుడినేనని స్పష్టం చేశారు.

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆహ్వానం మేరకే గన్నవరం నియోజకవర్గంలోని స్వర్ణభారత్‌ ట్రస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్నానన్నారు.  ట్రస్టు నిర్వహించిన కార్యక్రమంలో కిషన్‌రెడ్డితో కలిసి పాల్గొంటే దానిని తప్పు పట్టడం సరికాదన్నారాయన.