వంశీ సంచలన ఆరోపణలు..! నేను చెప్పింది 10 శాతమే..!

వంశీ సంచలన ఆరోపణలు..! నేను చెప్పింది 10 శాతమే..!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. టీడీపీ, చంద్రబాబు, లోకేష్‌పై ఆయన సూటిగా ఎటాక్ చేస్తున్నారు.. అయితే.. తాను ఇప్పటి వరకు చెప్పింది 10 శాతమే.. చెప్పాల్సింది చాలా ఉందన్నారు వల్లభనేని వంశీ.. ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. టీడీపీకి లోకేష్ ఓ పెద్ద గుదిబండ... టీడీపీకి లోకేష్ పెద్ద స్పీడ్ బ్రేకర్.. లోకేష్‌తో పార్టీ ముందుకు వెళ్లలేదని వ్యాఖ్యానించారు. నేను వెళ్తే టీడీపీకి నష్టం లేదు.. కానీ, లోకేష్ పార్టీలో ఉంటేనే పెద్ద నష్టం అంటూ విమర్శలు గుప్పించారు వంశీ. 

జూనియర్ ఎన్టీఆర్‌ను ఎన్నికల తర్వాత పట్టించుకున్నారా? అని ఫైర్ అయ్యారు వల్లభనేని వంశీ.. జూనియర్ ఎన్టీఆర్ ఉంటే పార్టీలో తమకు అడ్డం అనుకున్నారు..! అందుకే పక్కన బెట్టారని ఆరోపించారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీని అవసరానికి వాడుకున్నారు తప్పితే.. చంద్రబాబు చేసింది ఏంటి? అని నిలదీశారు వంశీ. ఇక, సుజనాచౌదరితో నాకు మంచి స్నేహమే ఉందన్న గన్నవరం ఎమ్మెల్యే.. బీజేపీలోకి రావాలని సుజనా చౌదరి ఎప్పుడూ పిలవలేదన్నారు.. సుజనా చౌదరితో లాంటి వాళ్లతో ఉంటేనే మంచిదని.. చంద్రబాబు, పప్పు లాంటి వాళ్లతో తిరిగితే ఎవరికైనా నిరాశే వస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు పార్టీ ఫండ్, ఎన్నికల్లో ఖర్చులపై చంద్రబాబుపై ధ్వజమెత్తారు వంశీ.. తన రెండెకరాల పొలంతోనే చంద్రబాబు ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారా? చంద్రబాబు వ్యవసాయం చేసి ఏమైనా పార్టీ ఫండ్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో నాతోపాటు చాలా మందికి టికెట్లు ఇచ్చారు.. వాళ్లంతా గెలిచిరా? మంగళగిరిలో పప్పు ఎందుకు గెలవలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. లోకేష్ మాటల వల్లే ఇంతలా స్పందిస్తునని తెలిపిన వంశీ.. ఇక, ఎన్నికలు నాకు కొత్తేమీ కాదు.. దమ్ముంటే గన్నవరంలో చంద్రబాబు, లోకేష్ పోటీ చేయాలని సవాల్ విసిరారు.