యార్లగడ్డకు.. వల్లభనేని వంశీ మరో లేఖ

యార్లగడ్డకు.. వల్లభనేని వంశీ మరో లేఖ

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ వైసీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావుకు.. సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. వల్లభనేని వంశీ గురువారం మరో లేఖను రాశారు. యార్లగడ్డ తనపై విమర్శలు చేసిన సమయంలో తాను ఊళ్లో లేనని.. అందుకే సమాధానం ఇవ్వలేకపోయానని తెలిపారు. బ్రహ్మయ్యలింగం చెరువు పూడికతీతకు రూ.150 కోట్ల నిధులు అవసరమవుతాయని స్పష్టం చేశారు. పూడికతీసిన మట్టిని జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టు విస్తరణకు వినియోగించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికే ఆదాయం వస్తుందని వెల్లడించారు. ఈ విషయంలో అభ్యంతరాలుంటే ఎన్‌ఐఏ, సీబీఐ దర్యాప్తు కోరవచ్చని లేఖలో వంశీ సూచించారు. ఇంతకుముందు వంశీ.. యార్లగడ్డకు లేఖ రాసిన విషయం తెలిసిందే. వంశీ రాసిన లేఖపై స్పందిస్తూ యార్లగడ్డ వెంకట్రావ్ మీడియా సమావేశం నిర్వహించి ఆయనపై పలు వ్యాఖ్యలు చేశారు. తనపై యార్లగడ్డ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా వంశీ గురువారం మరో లేఖాస్త్రాన్ని సంధించారు.