వాల్మీకి ప్రీ టీజర్ టాక్

వాల్మీకి ప్రీ టీజర్ టాక్

వరుణ్ తేజ్ హీరోగా చేస్తున్న వాల్మీకి సినిమాకు సంబంధించిన ప్రీ టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది.  ఈ టీజర్ పై అనేక అంచనాలు ఉన్నాయి.  కేవలం వరుణ్ తేజ్ లుక్ పై మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.  బ్లాక్ డ్రెస్ లో వరుణ్ తేజ్ హైలైట్ గా ఉన్నాడు.  ఇంతకు ముందెప్పుడూ చూడని గెటప్ లో ఆకట్టుకున్నాడు.  

ముఖ్యంగా వరుణ్ తేజ్ కళ్లపై కెమెరాను ఫోకస్ చేస్తూ తీసిన షాట్స్ హైలైట్ గా నిలిచాయి. 18 సెకన్లపాటు ఉన్న ఈ ప్రీ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉన్నది.  హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.  సెప్టెంబర్ 6 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.