వాల్మీకి డేట్ ఫిక్స్ !

వాల్మీకి డేట్ ఫిక్స్ !

హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త చిత్రం 'వాల్మీకి'.   తమిళ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్, ఆత్రవ మురళి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు చేస్తున్నారు.  14 రీల్స్ సంస్థపై రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 6వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు హరీష్ శంకర్ తెలిపారు.  ఇందులో వరుణ్ తేజ్ ఇంతకుముందెన్నడూ కనిపించని రీతిలో కనిపిస్తాడట.  ఇప్పటికే బయటికొచ్చిన కొన్ని లుక్స్  సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.