బ్రేకింగ్ : హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్య

బ్రేకింగ్ : హైకోర్టు న్యాయవాది వామన్ రావు దంపతుల దారుణ హత్య

పెద్దపెల్లి జిల్లాలో హైకోర్ట్ న్యాయవాది వామన్ రావు దంపతులపై దుండగులు విచక్షణరహితంగా దాడి చేశారు. రామ గిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారి పై గుంజ పడుగు గ్రామానికి చెందిన ప్రముఖ హై కోర్ట్ న్యాయవాది గట్టు వామన్ రావు దంపతులపై దుండగులు కత్తితో దాడి చేశారు. ప్రాణాపాయ స్థితిలో రోడ్డుపై పడి కోన ఉపిరితో  ఉన్న వామన్ రావు, ఆయన భార్యను ఆసుపత్రికి తరలించగా వారిద్దరూ మరణించినట్టు చెబుతున్నారు. దాడి చేసింది గుంజపడుగు గ్రామనికి చెందిన మంథని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ అని సమాచారం.వామన్ రావుతో పాటు ఆయన భార్య జీవి మణి మృతి చెందారు. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్టు చెబుతున్నారు. ఈయన గత కొంత కాలంగా పలు వివాదాలలో జోక్యం చేసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఆ కారణంగానే హత్య జరిగినట్టు చెబుతున్నారు. దానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.