వంశీ పైడిపల్లి, రామ్ చరణ్ కాంబో రిపీట్ ?

వంశీ పైడిపల్లి, రామ్ చరణ్ కాంబో రిపీట్ ?

దర్శకుడు వంశీ పైడిపల్లి ఇటీవలే 'మహర్షి' సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు.  దీంతో ఆయన నెక్స్ట్ సినిమాను ఎవరితో చేస్తాడు అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ఫిల్మ్ నగర్ టాక్ మేరకు ఆయన రామ్ చరణ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.  వంశీ, చరణ్ కలిసి గతంలో 'ఎవడు' అనే సినిమా చేశారు.  ఆ చిత్రం మంచి ఫలితాన్నే ఇచ్చింది.  అందుకే చరణ్ కూడా వంశీతో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట.  ప్రస్తుతం చరణ్ రాజమౌళితో చేస్తున్న సినిమా పూర్తవగానే పైడిపల్లి చిత్రాన్ని స్టార్ట్ చేసే అవకాశాలున్నాయి.