ఘోర ప్రమాదం-13 మంది మృతి

ఘోర ప్రమాదం-13 మంది మృతి

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తర్‌కాశి జిల్లాలో వ్యాను 200 మీటర్ల లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందారు. బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, రాధ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని డెహ్రాడూన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదం బట్వాడీకి 8 కి.మి. దూరంలోని షాగ్లై సమీపంలో జరిగింది.