రాధా ఆ మాట అంటారనుకున్నా: వంగవీటి నరేంద్ర

రాధా ఆ మాట అంటారనుకున్నా: వంగవీటి నరేంద్ర

టీడీపీలో వంగవీటి రాధాకృష్ణ చేరిన రోజు.. రంగా ఆత్మ క్షోభకు గురైన రోజు అని ఆయన సోదరుడు వంగవీటి నరేంద్ర అన్నారు. రాధాకృష్ట టీడీపీలో చేరడాన్ని నిరసిస్తూ నరేంద్ర విజయవాడలోని బందరు రోడ్డులో రంగా విగ్రహం వద్ద ఇవాళ ఉదయం బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాధా టీడీపీలో చేరడం రంగా అభిమానులను కలచివేస్తోందన్నారు. టీడీపీలో రాధా చేరికను జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. 
రాధా టీడీపీలో చేరడమేంటే అమ్ముడుపోవడమేనని అన్నారు. 'రంగాను హత్య చేసింది టీడీపీ ప్రభుత్వమే. ప్రజల కోసం పోరాడిన రంగాను ప్రభుత్వమే కావాలనే ఆనాడు చంపించింది' అని నరేంద్ర ఆరోపించారు. రంగా హత్యతో టీడీపీకి సంబంధం లేదనే మాటను నిన్ననైనా రాధా వెనక్కి తీసుకుంటారని అనుకున్నానని అన్నారు.