లోక్‌సభ బరిలోనే వంగవీటి రాధా..!

లోక్‌సభ బరిలోనే వంగవీటి రాధా..!

తెలుగుదేశం పార్టీ గూటికి చేరిన వంగవీటి రాధాకృష్ణ... ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కాకుండా... పార్లమెంట్‌ స్థానం బరిలోకే దిగనున్నారు. మచిలీపట్నం లోక్‌సభ స్థానం నుంచి ఆయన పోటీకి సిద్ధమవుతున్నారు. వంగవీటి రాధా కృష్ణ ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు... పెడన అసెంబ్లీ, బందరు లోక్‌సభ స్థానాలుంచగా... ఓవైపు పెడన ఎమ్మెల్యే స్థానంపై ఎంపీ కొనకళ్ల నారాయణ ఆసక్తి కనబరుస్తుండడంతో పెడన ఎమ్మెల్యే స్థానంపై రాధా ఆలోచన చేసినప్పటికీ చివరికి బందరు ఎంపీగా బరిలోకి దిగే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇక తనను నమ్మి పార్టీలో చేరిన వంగవీటి రాధాకు మంచి స్థానం కల్పించాలని చంద్రబాబు యోచిస్తున్నారు. దీనిలో భాగంగానే ఆయన్ని మచిలీపట్నం నుంచి లోక్‌సభ బరిలో దించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సుమారు 2.50 లక్షల కాపు సామాజికవర్గం ఓట్లు ఉండటం కూడా వంగవీటిని పార్లమెంటు బరిలో పెట్టడానికి ముఖ్యకారణంగా అంచనా వేస్తున్నారు.