చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ..!

చంద్రబాబుతో వంగవీటి రాధా భేటీ..!

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఇవాళ సమావేశం కానున్నారు వంగవీటి రాధాకృష్ణ.. అసెంబ్లీ స్థానం విషయంలో వైసీపీతో విభేదించిన ఆయన... ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చేరడం ఖాయం కాగా... ఇవాళ టీడీపీ అధినేతతో సమావేశమై... పార్టీలో చేరడానికి సంబంధించిన తేదీని ఖరారు చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఇక బెజవాడలో ఇళ్ల పట్టాల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీచేసే అవకాశం ఉందంటున్నారు. ఈ నెలాఖరులోగా వంగవీటి రాధాకృష్ణ.. సైకిల్ ఎక్కుతారని చెబుతున్నారు ఆయన అనుచరులు.