లోక్‌సభ బరిలో రాధా..?  

లోక్‌సభ బరిలో రాధా..?  

టీడీపీలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. లోక్ సభ బరిలో దిగే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. తాను ప్రచారానికే పరిమితమవుతానని రాధా చెబుతుండగా.. పోటీ చేస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను టీడీపీ అధినాయకత్వం ఆయన ముందుంచింది. ఈక్రమంలో నరసాపురం, అనకాపల్లి లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసే అంశాన్ని రాధా పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రాధాకృష్ణ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.