బాలకృష్ణ సినిమాలో ఆమె విలనా..?

బాలకృష్ణ సినిమాలో ఆమె విలనా..?

ఎన్టీఆర్ బయోపిక్ మిగిల్చిన చేదు అనుభవం నుంచి బాలకృష్ణ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. బయోపిక్ తరువాత బాలకృష్ణ రవికుమార్ తో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  మే 17 వ తేదీన సినిమా ప్రారంభం కాబోతున్నది.  జైసింహా వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన నిర్మాత సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఇందులో లెజెండ్ విలన్ జగపతిబాబు మరోసారి విలన్ గా కనిపించబోతున్నాడు.  

ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే... ఇందులో జగపతిబాబుతో పాటు మరో లేడీ విలన్ కూడా ఉంటుందట.  తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది.  తమిళంలో ఇప్పటికే ఆమె పలు సినిమాల్లో విలన్ రోల్స్ చేసి మెప్పించింది.