అవిశ్వాసం ఎన్డీఏకు చెంపపెట్టు...

అవిశ్వాసం ఎన్డీఏకు చెంపపెట్టు...

అధికారం కోసం భారతీయ జనతా పార్టీ ఎంతకైనా బరితెగిస్తోందని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు... పార్లమెంట్‌లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే... పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీల గొంతు నొక్కినా ప్రజల్లో మా గళం వినిపిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య... బీజేపీ చెబితే టీడీపీ అవిశ్వాసం పెట్టిందని జగన్ ఆరోపించడం అవగాహన లేమి అన్నారు. జనసేన అధినేత పవన్‌పై కూడా సెటర్లు వేశారు రామయ్య... పార్లమెంట్‌లో అవిశ్వాసంపై చర్చ జరుగుతుంటే పవన్ ఎక్కడ దాక్కున్నాడో అర్ధం కావడం లేదంటూ ఎద్దేవా చేశారు.