'టీఆర్ఎస్‌ విజయంలో పవన్, జగన్‌ కీలక పాత్ర..'

'టీఆర్ఎస్‌ విజయంలో పవన్, జగన్‌ కీలక పాత్ర..'

తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారని... కూకట్‌పల్లిలో విజయ సాధించిన అభ్యర్థి... పవన్, జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారని ఆరోపించారు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య... అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన... వారి ఆస్తులు, సంపాదన హైదరాబాద్‌లో ఉన్నాయి కనుక పవన్, జగన్‌... కేసీఆర్‌కు మద్దతు తెలిపారని విమర్శించారు. ఏపీ ప్రయోజనాలను అడ్డుకొన్న వ్యక్తికి మద్దతు తెలుపుతారా? అని మండిపడ్డ వర్ల రామయ్య... సీఎం కేసీఆర్‌ను అభినందించడానికి హుటాహుటినా పవన్ అమెరికా నుంచి వస్తున్నారంటూ సెటైర్లు వేశారు. బయ్యారం గనుల కోసం జగన్.. టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నారని ఆరోపించిన ఆయన... ఏపీలో కేసీఆర్ ప్రచారం చేసుకుంటే అభ్యంతరం లేదన్నారు. ఇక కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం... చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వల్లర రామయ్య.