వివేకా హత్యకు గల కారణాలు జగన్ కు తెలుసు

వివేకా హత్యకు గల కారణాలు జగన్ కు తెలుసు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. మాజీ మంత్రి, వివేకా హత్యకు గల కారణాలు జగన్ కు తెలుసని వ్యాఖ్యానించారు. ఆ కారణంగానే హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వివేకాకు అర్థరాత్రి 1.30కి ఓ మహిళ నుంచి మెసేజ్ వచ్చింది. మీ కూతురు వల్ల మా జీవితం నాశనం అయింది. దానికి తగిన శిక్ష అనుభవిస్తావు’ అని మేసేజ్‌ వచ్చిందని వర్ల రామయ్య అన్నారు. ఘటనాస్థలికి మొదట శివప్రకాష్ రెడ్డి వచ్చాడని చెప్పారు. బాబాయ్ హత్యను కూడా రాజకీయం చేస్తున్న జగన్ తీరు క్షమించరానిదని మండిపడ్డారు. వాస్తవాలు బయటకు రాకుండా చేయడానికే సీబీఐ విచారణ కోరుతున్నారని వర్ల రామయ్య దుయ్యబట్టారు. కేసీఆర్ ఆమోదం తెలిపిన అభ్యర్థుల్నే జగన్ ప్రకటించారని ఎద్దేవా చేశారు. జైల్లో ఉండాల్సిన వ్యక్తి.. ఎన్నికల బరిలో నిలిచాడని వ్యాఖ్యానించారు.