ఒక్కడి కోసం అంతమందా..?

ఒక్కడి కోసం అంతమందా..?

రామ్ గోపాల్ వర్మ సినిమా మొదలుపెట్టిన దగ్గరి నుంచి వార్తల్లో ఉంటాడు.  సినిమా ఫలితంతో పెద్దగా సంబంధం లేకుండా వార్తల్లో ఉండటం షరా మామూలే.  రీసెంట్ గా వర్మ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వార్తల్లో నిలిచింది.  ఎన్టీఆర్ జీవితం గురించి లక్ష్మి పార్వతి కోణంలో తీసిన సినిమాను ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కాకుండా అడ్డుకున్నారు.  ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా సినిమాను రిలీజ్ చేయలేదు.  

ఎన్నికలు పూర్తి కావడంతో... మే 1 వ తేదీన సినిమాను రిలీజ్ చేసేందుకు వర్మ సిద్ధం అయ్యారు.  దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ను విజయవాడలో ఏర్పాటు చేశారు.  ఆ ప్రెస్ మీట్ కు వెళ్లకుండా వర్మను విజయవాడ ఎయిర్ పోర్ట్ లో అడ్డుకోవడంతో పాటు పోలీసులు వర్మను హోటల్ గదిలోనుంచి బయటకు రానివ్వకుండా ఉంచడంతో.. పెద్ద దుమారం జరిగింది.  ఒక వ్యక్తిని అడ్డుకోవడానికి అంతమంది పోలీసులు రావడం ఎందుకని వర్మ ప్రశ్నించాడు.  ఈ సందర్భంగా హైదరాబాద్ లో వర్మ ప్రెస్ మీట్ పెట్టి తాను అడిగిన 16 ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుంటే లీగల్ గా చర్యలు తీసుకుంటానని చెప్పాడు వర్మ.