అసెంబ్లీ సమావేశాలపై వర్మ షాకింగ్ కామెంట్స్

అసెంబ్లీ సమావేశాలపై వర్మ షాకింగ్ కామెంట్స్

బర్నింగ్ టాపిక్ పై స్పందించడంలో వర్మ ఎప్పుడు టాప్ లిస్ట్ లో ఉంటాడు.  ప్రస్తుతం రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అసెంబ్లీ సమావేశాలు.  సమావేశలలో అసలు కంటే ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టున్నారు. గతంలో జరిగిన తప్పులను ఎత్తి చూపడం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం.. నింద చేసుకోవడంతోనే సమయం గడిచిపోతుంది.  

దీనిపై వర్మ స్పందించారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేది అరవడం, నిందలు వేయడం, గత సమస్యల గురించి ఫిర్యాదు చేయడంతోనే సరిపోతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు పౌరుషాలకు, ప్రతీకారాలకు పోయి ప్రస్తుత రాష్ట్ర భవిష్యత్తు సమస్యలను పక్కన పెడుతున్నారని దీనికి సంబంధించి జ‌స్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు.  చాలా కాలం తరువాత వర్మ ఒక ఇష్యూ మీద పాజిటివ్ గా ట్వీట్ చేయడంతో అందరు షాక్ అవుతున్నారు.