దిశ కేసు ఆధారంగా వర్మ సినిమా... విలన్ ఎవరంటే... 

దిశ కేసు ఆధారంగా వర్మ సినిమా... విలన్ ఎవరంటే... 

దిశ ఘటన రాష్ట్రంలో ఎన్ని మార్పులు తీసుకొచ్చిందో చెప్పక్కర్లేదు.  దిశ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకొని, ఆ తరువాత కేసు రి కంస్ట్రక్షన్ చేసే సమయంలో పారిపోయేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు.  ఈ న్యూస్ అప్పట్లో సంచలనం సృష్టించింది.  

ఎక్కడ సంచలనం ఉంటె అక్కడ సినీ దర్శకుడు వర్మ ఉంటాడు.  ఇప్పుడు వర్మ దృష్టి దిశ కేసుపై పడింది.  ఈ కేసు ఆధారంగా సినిమా చేయబోతున్నాడు.  దిశ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి దిశ దోషుల్లో ఒకరైన చెన్నకేశవులు భార్యను వర్మ కలిశారు.  ఆమె దగ్గర నుంచి విలువైన సమాచారం రాబట్టాడు.  16 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం, 17 ఏళ్ల వయసులో చెన్నకేశవులు భార్య రేణుక గర్భవతి కావడంతో వర్మ ఆవేదన చెందుతున్నాడు. దిశనే కాకుండా రేణుకను కూడా చెన్నకేశవులు బాధితురాలిని చేశాడని వర్మ ట్వీట్ చేశారు.  అటు నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, వాళ్లకు లాయర్ ఏపీ సింగ్ ఇస్తున్న సహకారం గురించి ఈ సినిమాలో చూపించబోతున్నారట.  ఎపి సింగ్ పాత్రను విలన్ గా చూపించబోతున్నారని తెలుస్తోంది.