వర్మకే ఇలాంటి ఐడియాలు వస్తాయేమో...

వర్మకే ఇలాంటి ఐడియాలు వస్తాయేమో...

రామ్ గోపాల్ వర్మ క్రియేటివ్ డైరెక్టర్ అనడంలో సందేహం లేదు.   కెరీర్ స్టార్టింగ్ లో వర్మ సినిమాల కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారు.  ఆ తరువాత వర్మ సినిమాలంటే జనాలు భయపడే విధంగా మారిపోయింది.  అయినప్పటికీ వర్మకి క్రేజ్ తగ్గలేదు. వివాదాస్పద సబ్జెట్స్ తో బయోపిక్ లు చేయడంలో వర్మ దిట్ట.  సర్కార్, సర్కార్ రాజ్, రక్త చరిత్ర, కిల్లర్ వీరప్పన్ సినిమాలు ఇందుకు ఉదాహరణలు.  

రీసెంట్ గా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చేశాడు.  ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ కాకుండా అడ్డుకోవడంతో వర్మ  టిడిపినేతలపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే.  ఆదివారం రోజున వర్మ విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు.  

వర్మకు వచ్చే ఆలోచనలు చాల విచిత్రంగా ఉంటాయి. గెలిచిన పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు చెప్పడం సహజమే కదా.  అలా చెప్పేవాళ్ళల్లో ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులు కూడా ఉండొచ్చు.  ఈ పాయింట్ పై వర్మ ఓ ట్వీట్ చేశారు.  ఓడిన వ్యక్తులు గెలిచిన వాళ్లకు శుభాకాంక్షలు చెప్పడం ఏంటి... ఓడిపోయినందుకు బాధ ఉండాలి.. లేదంటే కోపం ఉండాలి.  ఇలా శుభాకాంక్షలు చెప్పడం ఏంటి అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.  ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ గా మారింది.  వర్మ కాబట్టే ఇలాంటి ఆలోచనలు వస్తాయని నెటిజన్లు అంటున్నారు.