వర్మ అప్పుడే మొదలుపెట్టేశాడు...

వర్మ అప్పుడే మొదలుపెట్టేశాడు...

ఎన్నికల కౌంటింగ్ చాలా వరకు పూర్తయింది.  గెలుపు ఎవరిదీ అనే విషయం ఇప్పటికే స్పష్టం కావడంతో గెలిచినా పార్టీ ఆఫీస్ ల వద్ద సంబరాలు మొదలయ్యాయి.  బాబు ఓటమిని అంగీకరించక తప్పని పరిస్థితి వచ్చింది.  బాబు ఓడిపోయారని వైకాపా చేసుకుంటున్న సంబరాల కంటే... వర్మ ఆనందం ఎక్కువైందని చెప్పొచ్చు.  

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ కాకుండా అడ్డుకోవడంతో వర్మ వీలు దొరికినప్పుడల్లా సెటైర్లు వేస్తుండేవాడు.  ఇదిలా ఉంటె, ఈరోజు ఫలితాలు వెలువడుతున్న సమయంలో వర్మ తన ట్విట్టర్ ద్వారా బాబు గురించి సెటైరికల్ ఫోటోను పోస్ట్ చేశాడు.  అందులో సైకిల్ చక్రం వెనుక దిగాలుగా కూర్చొని ఉన్న ఫోటో అది.  ఆ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.