చిన్నారి వర్షిత హత్య కేసు...తెలివిగా ప్లాన్ చేసిన నిందితుడు !

చిన్నారి వర్షిత హత్య కేసు...తెలివిగా ప్లాన్ చేసిన నిందితుడు !

చిత్తూరులో చిన్నారి వర్షితపై అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వర్షితపై అత్యాచారం, హత్య జరిగిన తరువాత పోలీసులు ఊహాచిత్రంను రిలీజ్ చేశారు. అనంతరం పోలీసులు రఫీని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తరువాత పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు.  గతంలో కూడా రఫీ చిన్నారులపైనా అత్యాచారాలకు పాల్పడిన సంగతి తెలిసిందే.  ఇలాంటి కేసుల్లోనే అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు.  చిన్నారి వర్షితకు చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేసినట్టుగా నిందితుడు ఒప్పుకున్నట్టు పోలీసులు తెలిపారు.  

అయితే, నిందితుడిని ప్రజలకు అప్పగించాలని పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముందు ప్రజలు చేరడంతో.. బందోబస్తుతో అతడిని జైలుకు తరలించారు.  బాలికపై అత్యాచారం చేసి.. హత్య చేసిన రఫీ.. పోలీసులు గుర్తుపట్టకుండా గుండు గీయించుకోని, క్లీన్ షేవ్ చేయించుకుని పారిపోయాడు. అతడు టమోటా లారీకి క్లీనర్‌గా ఛత్తీస్‌గడ్‌ వెళ్లాడని తెలియడం, అక్కడ కొందరు డ్రైవర్లు సామాజిక మాధ్యమాల్లో అతడి ఫొటోను చూసి చెప్పడంతో వెంటనే అక్కడి నుంచి మదనపల్లెకు తిరిగొచ్చేశాడు. నిందితుడు తనను ఎవరూ గుర్తుపట్టకుండా గుండు చేయించుకున్నాడు. ప్రత్యేక బృందాలు ఛత్తీస్‌ఘడ్‌కు వెళ్లి అతడి సెల్‌ఫోన్‌ను ట్రాకింగ్‌ చేయడంతో మదనపల్లె లొకేషన్‌ చూపడంతో రహస్యంగా మాటువేసి ఇక్కడే అరెస్టు చేశారు.