ఐపీఎల్‌ నుంచి కాస్ట్‌లీ క్రికెటర్‌ అవుట్‌..!

ఐపీఎల్‌ నుంచి కాస్ట్‌లీ క్రికెటర్‌ అవుట్‌..!

వరుణ్‌ చక్రవర్తి గుర్తున్నాడా..? తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో ఆకట్టుకున్న ఈ 27 ఏళ్ల లెగ్‌ స్పిన్నర్‌ను.. ఐపీఎల్‌ వేలంలో పంజాబ్‌ జట్టు ఏకంగా రూ. 8 కోట్ల 40 లక్షలకు కొనుగోలు చేయడంతో అందరి దృష్టి ఇతనిపై పడింది. గత నెలలో కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన వరుణ్‌.. ఒకే ఒక్క వికెట్‌ పడగొట్టి 35 పరుగులిచ్చాడు. గాయం కారణంగా ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పటికీ గాయం నుంచి కోలుకోవపోవడంతో ఏకంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి వరుణ్‌ను కొనుగోలు చేసిన పంజాబ్‌.. ఇతని స్పిన్‌పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. కానీ ఒకేఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడి ఐపీఎల్‌కు దూరమవడం వరుణ్‌ బ్యాడ్‌ టైమ్‌ అనే చెప్పాలి.