ఘనంగా వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా వివాహం

ఘనంగా వ‌రుణ్ ధావ‌న్, న‌టాషా వివాహం

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్ తో వివాహం జరిగింది. కొద్దిరోజులు ప్రేమలో ఉన్న వీరు వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహం ముంబైలోని ఓ రిసార్ట్‌లో ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకి పరిమిత సంఖ్యలోనే వరుణ్, నటాషా కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఇక వరుణ్ పెళ్ళికి బాలీవుడ్ ప్రముఖులు అందరూ హాజరు అయ్యారు. గ‌త ఏడాది పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ కరోనా కరోనా కారణంగా ఆలస్యం అయింది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్‌లో సీనియర్ దర్శకుడు. ప్రస్తుతం ఈ వివాహ ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bombay Times (@bombaytimes)