వరుణ్ ను ఫిదా చేసిన భామ ఈమె..!!

వరుణ్ ను ఫిదా చేసిన భామ ఈమె..!!

గతేడాది సెలెబ్రిటీల వివాహాలు వరసగా జరుగుతున్నాయి.  సోనమ్ కపూర్, దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, ప్రియాంక చోప్రా వివాహాలు జరిగిపోయాయి.  ఈ సెలెబ్రిటీల లిస్ట్ లో ఈ ఏడాది మరికొంతమంది కూడా చేరబోతున్నారు.  వారిలో ముందువరసలో ఉన్న వ్యక్తి వరుణ్ ధావన్.   ఈ సుయ్ దాగా హీరో తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్ ప్రేమలో పడ్డారట.  ఆమెను వరుణ్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.  

డిసెంబర్ లో వీరి వివాహం జరగబోతున్నట్టు సమాచారం.  ఈ వివాహం విషయంపై ఇటు వరుణ్ ధావన్ తాల్లిదండ్రులు గాని, అటు నటాషా తరఫువారు గాని ఇప్పటి వరకు స్పందించలేదు.