పెళ్లి పీటలెక్కనున్న బీ టౌన్ హీరో..

పెళ్లి పీటలెక్కనున్న బీ టౌన్ హీరో..

బాలీవుడ్ యంగ్ స్టార్లలో వరుణ్ ధావన్ కూడా ఒకడు. స్టార్ హీరో హోదాను దాదాపు చేజిక్కించుకున్నాడు. అయితే అతడు ఈ నెల 24న పెళ్లి పీటలెక్కనున్నాడని వార్తలు అనేకంగా వచ్చాయి. అయితే వీటిని నిజం చేస్తూ వరుణ్ ధావన్ మేనమామ క్లారిటీ ఇచ్చాడు. ఈ నెల వరుణ్ తన ప్రేయసి నటాషాను వివాహం చేసుకోనున్నాడని చెప్పారు. ఈ పెళ్లి వేడుక జనవరీ24న అలీబాగ్‌లో జరగనుంది. గతంలో వరుణ్ వివాహంపై వచ్చిన వార్తల్లనింటిని పుకార్లని కొట్టిపారేసిన అనిల్ ఇప్పుడు స్వయంగా పెళ్లి తేదీని ప్రకటించడం విశేషం. అయితే కరోనా నిబంధనల కారణంగా వివాహానికి పరిమిత సంఖ్యలో వివాహానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. కేవలం 50 మంది మాత్రమే అతిథులు వేడుకలో పాల్గొననున్నారు. ఇందులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్, శిల్పాశెట్టి దంపతులు వంటి సెలబ్రిటీలు ఈ వేడుకలో పాల్గొననున్నారు. ఈ వేడుక జనవరి 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ధూమ్ ధామ్‌గా జరగబోతుంది. ఇదిలా ఉంటే ఇదే ఏడాది బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్, అలియా భట్ వివాహం కూడా జరిగే అవకాశాలు అనేకం కనిపిస్తున్నాయి.