నా స్టైల్ ఐకాన్ కళ్యాణ్ బాబాయ్ !

నా స్టైల్ ఐకాన్ కళ్యాణ్ బాబాయ్ !

వరుణ్ తేజ్ నటించిన 'అంతరిక్షం' రేపు భారీ ఎత్తున రిలీజ్ కానుంది.  ఈ సందర్బంగా ఆయన అభిమానులతో ట్విట్టర్లో చాట్ సెషన్ నిర్వహించి వాళ్ళడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు.  అభిమానుల్లో ఒకరు మీ స్టైల్ ఐకాన్ ఎవరని అడగ్గానే వరుణ్ తేజ్ వెంటనే ఇంకెవరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ అందరు అభిమానుల్లాగే సమాధానమిచ్చాడు.  ఇకపోతే సంకల్ప్ రెడ్డి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా తెలుగులో రూపొందిన మొట్ట మొదటి స్పేస్ సినిమా కావడం విశేషం.  అందుకే అందరిలోనూ సినిమాపై విపరీతమైన ఆసక్తి  నెలకొని ఉంది.