పవన్ పార్టీకి వరుణ్, నాగబాబు భారీ విరాళం

పవన్ పార్టీకి వరుణ్, నాగబాబు భారీ విరాళం

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన తరువాత సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లో క్రియాశీలంగా మారారు.  వచ్చే ఏడాది  జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఎన్నికల సంఘం ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసును కేటాయించింది.  ఈ గుర్తు గురించి జనసేన పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు కుటుంబంతో కలిసి యూరప్ వెళ్లారు.  

 ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ పార్టీకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కోటి రూపాయల సహాయాన్ని అందించారు.  అటు పవన్ సోదరుడు నాగబాబు కూడా పవన్ పార్టీకి రూ.25 లక్షల రూపాయలు డొనేషన్ అందించారు.  ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ ట్విట్టర్  తెలియజేశారు.  యూరప్ నుంచి వచ్చిన తరువాత పర్సనల్ గా వచ్చి కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తానని పేర్కొన్నాడు.