వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్..

వరుణ్ తేజ్ కార్ యాక్సిడెంట్..

వాల్మీకి సినిమా హీరో వరుణ్ తేజ్ కార్ వనపర్తి లోని కొత్తకోట వద్ద యాక్సిడెంట్ కు గురైంది.  వరుణ్ ప్రయాణిస్తున్న కారు ఈ యాక్సిడెంట్ కారణంగా దెబ్బతినగా, వరుణ్ సేఫ్ గా బయటపడ్డారు.  హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న సమయంలో ఎన్ హెచ్ 44 జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.  కొత్తపేట మండలం జాతీయ రహదారి రాణిపేట దగ్గర యూ టర్న్ అవుతున్న ఇండియా కారును వరుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడి కారు ఢీకొట్టింది.  ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో వరుణ్ తేజ్ సేఫ్ గా బయటపడ్డారు.  అయితే, ఇండియా కారులో ప్రయాణిస్తున్న  గాయాలయ్యాయి.  ఈ ముగ్గురిని హాస్పిటల్ కు తరలించారు. 

విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.  వరుణ్ తేజ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.  

https://twitter.com/IAmVarunTej/status/1138825720455503873