పవన్ ఫిలాసఫీని ఫాలో అవుతున్న వరుణ్ తేజ్ !
హిట్.. ఫ్లాప్.. ఈ విషయాలను అస్సలు పట్టించుకోను అనేది పవన్ ఫిలాసఫీ. ఆ ప్రకారమే సినిమాలు చేస్తూ వెళ్ళారాయన. ఆ ఫిలాసఫీని మెగా ఫ్యామిలీలో గట్టిగా ఫాలో అయ్యే హీరో వరుణ్ తేజ్. కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇప్పటి వరకు బ్రేక్ పడకుండా ప్రయాణం సాగిస్తున్నాడీ హీరో. ఫ్లాప్ వచ్చిందని నెక్స్ట్ సినిమా ఆలస్యం చేయడం, హిట్ దొరికింది కదా అని ఓ మూడు నాలుగు సినిమాలకు సైన్ చేసేయడం వరుణ్ తేజ్ పద్దతి కాదు. ముందు సినిమా రిజల్ట్ ఏదైనా దాని ప్రభావం తరువాతి సినిమా మీద పడకుండా జాగ్రత్తపడతాడు. ఇటీవలే 'అంతరిక్షం'తో నిరాశ చెందిన ఆయన తాజాగా 'ఎఫ్ 2'తో బ్లాక్ బస్టర్ అందుకుని సంక్రాంతి విజేత అయ్యాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు. ఈ నెలాఖరులో ఆ సినిమా మొదలయ్యే సూచనలున్నాయి
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)