వరుణ్ జోష్ మీదున్నాడు..

వరుణ్ జోష్ మీదున్నాడు..

ముకుందా సినిమాతో వరుణ్ తేజ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.  ముకుందా యావరేజ్ గా నిలిచింది.  ఈ సినిమా అనంతరం క్రిష్ దర్శకత్వంలో కంచె చేశాడు.  రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల మెప్పును పొందింది.  భావోద్వేగాలను మాస్ కు నచ్చే విధంగా ఇంటెన్సివ్ గా తీయలేకపోవడంతో.. సినిమా ఒకే అనిపించింది.  మాస్ హిట్ కోసం చేసే ప్రయత్నంలో వరుణ్ పూరితో లోఫర్, శ్రీను వైట్లతో మిస్టర్ చేశాడు.  రెండు దారుణంగా పరాజయం పాలయ్యాయి.  ఆ తరువాత చేసిన ఫిదా సూపర్ హిట్టైంది.  హీరోగా వరుణ్ కు మంచిపేరు తెచ్చిపెట్టింది.  

ఈ సినిమా తరువాత ప్యూర్ లవ్ స్టోరీతో, పవన్ కళ్యాణ్ టైటిల్ తో తొలిప్రేమ చేశాడు.  ఈ సినిమా సూపర్ హిట్టైంది.  దీంతో వరుణ్ హీరోగా స్టాండ్ అయ్యాడు.  కొత్త కొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్దమైన వరుణ్.. ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో అంతరిక్షం చేశాడు.  ఎన్నో అంచనాల మధ్య వచ్చి ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది.  కథనాల మీదకంటే దర్శకుడు సైన్స్ ను బోధించడంపైనే ఎక్కగా దృష్టిపెట్టడంతో సినిమా ఫెయిల్ అయ్యింది.  అనంతరం వెంకటేష్ తో కలిసి ఎఫ్2 గా వచ్చాడు.  ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్టైంది.  కెరీర్లో వందకోట్ల మార్క్ ను టచ్ చేసిన సినిమాగా నిలిచింది.  ఈ జోష్ తో ఇప్పుడు వరుణ్.. పవన్ కు గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు.  14 రీల్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కబోతున్నది.  జనవరి 27 వ తేదీన ఈ సినిమా రామానాయుడు స్టూడియోస్ ప్రారంభం కాబోతున్నది.  ఈ సినిమాతోనైనా వరుణ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకుంటాడేమో చూడాలి.