వరుణ్ తేజ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ వచ్చేస్తుంది..
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస సినిమాలు చేస్తూ యువ హీరో జోరు కొనసాగిస్తున్నాడు. ఒకపక్క ఎఫ్3 చేస్తూనే మరో సినిమాను కూడా పట్టాలెక్కించాడు. వరుణ్ తేజ్ పదో సినిమా ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. అందులో కేవలం చేతులే కనిపిస్తున్న అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాక్సింగ్ చేసేందుకు సిద్దమవుతున్నట్లు చేతులకు క్లాత్ కట్టుకుంటూ ఉన్న ఈ పోస్టర్‌తో త్వరలో ఫస్ట్ లుక్ వచ్చేస్తుందని తెలిపింది. ఈ ఫస్ట్ లుక్‌ను ఈ నెల 19వ తారీకున ఉదయం 10గంటల 10నిమిషాలకు విడుదల చేయనున్నారట. ఇందులో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నాడా అని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇందులో పూజా హెగ్దె హీరోయిన్గా చేసింది. దీని తరువాత కంచె సినిమాతో మంచి హిట్ అందుకున్న వరుణ్ తరువాత తన కెరీర్లో ఫిదా, తొలిప్రేమ వంటి భారీ విజయాలను అందుకున్నాడు. వెంటనే విక్టరీ వెంకటేష్‌తో కలిసి ఎఫ్2 సినిమా చేశాడు. ఎప్పుడు ఎఫ్2కు సీక్వెల్‌గా వస్తున్న ఎఫ్3లో నటిస్తున్నాడు. దానితో పాటు తాను హీరోగా మరో సినిమాను కూడా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)