గద్దలకొండ గణేష్ అంటే... గత్తర లేవాలా..!!

గద్దలకొండ గణేష్ అంటే... గత్తర లేవాలా..!!

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ వేడుకకు వెంకటేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు.  వాల్మీకి సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  ఎఫ్ 2 అంతటి పెద్ద హిట్ కావాలని వెంకటేష్ పేర్కొన్నారు.  అనంతరం వాల్మీకి హీరో వరుణ్ తేజ్ మాట్లాడారు.  ఎప్పటి నుంచో పెరఫార్మన్స్ కు స్కోప్ ఉండే పాత్ర చేయాలని కోరుకుంటున్నానని ఆ కోరిక ఈ సినిమాతో తీరిందని అన్నారు.  సెప్టెంబర్ 20 వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని, ప్రతి ఒక్కరికి తప్పకుండా నచ్చుతుందని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.  పూజా హెగ్డేతో కలిసి చేసే సీన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయని, కానీ, ఆ సీన్స్ సూపర్బ్ గా వచ్చాయని పేర్కొన్నారు.  సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు వాల్మీకి దుమ్ము రేపడం ఖాయం అని గద్దలకొండ గణేష్ అంటే గత్తర లేవాలని అన్నారు.