మెగా ఫ్యామిలీని వదలని కరోనా.. వరుణ్ తేజ్ కూడా..
కరోనా మహమ్మారి విజృంభణకు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కు జరిపిన పరీక్షలలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని వరుణ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. హోమ్ క్వారంటైన్ పాటిస్తూ మందులు వాడుతున్నాను అని తెలిపాడు. అయితే తనతో టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. కాగా ఈరోజు ఉదయం రామ్ చరణ్ కూడా కరోనా బారిన పడ్డారు.
అయితే క్రిస్మస్ సందర్భంగా రామ్ చరణ్ తన ఇంటికి మెగా ఫ్యామిలీని ఆహ్వానించగా, ప్రతి ఒక్కరు ఈ వేడుకలో సంతోషంగా పాల్గొన్నారు. సరిగ్గా నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ వేడుకలో పాల్గొన్న వారందరు చరణ్‌కు సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగారు. ఇప్పుడు చరణ్‌కు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మిగతా వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)