శ్రీకాంత్ అడ్డాలకు మరో ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో..

శ్రీకాంత్ అడ్డాలకు మరో ఛాన్స్ ఇచ్చిన మెగా హీరో..

మెగా హీరో వరుణ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'ముకుందా' సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వరుణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం వరుణ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో నటించే సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఇందులో వరుణ్, బాక్సర్‌గా కనిపించనుండగా.. మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక వరుస విజయాలతో అందుకుంటున్న వరుణ్ కోసం దర్శకులు క్యూ కడుతున్నారు. 

ఇప్పటికే సురేందర్ రెడ్డితో ఒక సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం శ్రీకాంత్ అడ్డాలకు ఈ హీరో రెండో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక ప్రస్తుతం శ్రీకాంత్ వెంకటేష్ తో 'అసురన్' రీమేక్ 'నారప్ప' అనే అనే సినిమాను తెరకేక్కిస్తున్నాడు.  ఈ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా సినిమాలు చెయ్యాలని బావిస్తున్నాడు శ్రీకాంత్.. ఇప్పటికే వరుణ్ కు లైన్ చెప్పడం వరుణ్ ఓకే చేసాడని తెలుస్తుంది. మరి మరో సారి ఈ కంబో ఆకట్టుకున్తుందేమో చూడాలి