విదేశాల్లో వరుణ్ తేజ్ కఠోర శ్రమ !

విదేశాల్లో వరుణ్ తేజ్ కఠోర శ్రమ !

ఇటీవలే 'ఎఫ్ 2' సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకున్న వరుణ్ తేజ్ 'వాల్మీకి' అనే కొత్త సినిమాను  మొదలుపెట్టాడు.  ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ డైరెక్ట్ చేయనున్నాడు.  తమిల్ హిట్ సినిమా 'జిగర్తాండ'కు ఇది రీమేక్.  అందులో బాబీ సింహ చేసిన పాత్రను తెలుగులో వరుణ్ చేయనున్నాడు.  ఈ పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు వరుణ్.  దానికి సంబందించిన ట్రైనింగ్ కోసం లాస్ ఏంజిల్స్ వెళ్ళాడు.  కొన్ని రోజుల పాటు అక్కడే ఉండి శిక్షణ తీసుకోనున్నాడు.  త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలుకానున్న ఈ చిత్రంలో కథానాయకిగా మృణాళినీ రవి, ఈషా రెబ్బ పేర్లను పరిశీలిస్తున్నారు.