వాల్మీకి టీజర్ డేట్ ఫిక్స్...

వాల్మీకి టీజర్ డేట్ ఫిక్స్...

తమిళంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన జిగర్తాండ సినిమా సూపర్ హిట్టైంది.  ఈ సినిమాను తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ వాల్మీకి గా తీస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది.  వరుణ్ తేజ్ ను చాలా కొత్తగా ప్రజెంట్ చేయబోతున్నాడు హరీష్.  ఉంగరాల జుట్టు.. పెద్ద మీసాలు, గుబురు గడ్డంతో రగ్డ్ లుక్ తో చూపించబోతున్నాడు.  

నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో వరుణ్ కనిపిస్తున్నాడు.  ఆగస్టు 15 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ కాబోతున్నది.  అందరు మెచ్చే విధంగా టీజర్ మేకింగ్ ఉంటుందని హరీష్ అంటున్నాడు.పూజా హెగ్డే హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 13 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.