సురేందర్ రెడ్డి నిర్మాణంలో వరుణ్ తేజ్ సినిమా... 

సురేందర్ రెడ్డి నిర్మాణంలో వరుణ్ తేజ్ సినిమా... 

సురేందర్ రెడ్డి చాలా సినిమాలు చేశారు.  అతనొక్కడే సినిమాలో తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించిన సురేందర్ రెడ్డి కెరీర్లో కిక్, రేసుగుర్రం, ధ్రువ, సైరా వంటి బెస్ట్ హిట్స్ ఇచ్చాడు.  సైరాతో సురేందర్ రెడ్డి టాప్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయాడు.  ఇప్పుడు ఈ దర్శకుడు నిర్మాతగా మారబోతున్నాడు.  ఇప్పటికే సురేందర్ రెడ్డి రెండు కథలు, వాటికి స్క్రీన్ ప్లే లు రెడీ చేసుకున్నాడు.  ఆ కథలతో తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించబోతున్నాడు.  

అందులో ఓ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా చేసున్నారట.  సైరా తరువాత సురేందర్ రెడ్డితో సినిమా చేయాలని వరుణ్ కోరుకుంటున్నాడు.  సురేందర్ రెడ్డితో సినిమా చేయలేకపోయినా, సురేందర్ రెడ్డి నిర్మించే సినిమాలో నటిస్తున్నాడు వరుణ్.  వరుణ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథతో సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయ్యాక వరుణ్ తేజ్ సురేందర్ రెడ్డి నిర్మాణంలో సినిమా చేస్తారట.