ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం..

ప్రజావేదిక కూల్చివేత ప్రారంభం..

ఆంధ్రప్రదేశ్‌ అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ మొదలైంది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అధికారులు కూల్చివేత ప్రారంభించారు. ప్రజావేదికలోని ఫర్నీచర్‌, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్‌ సామగ్రిని వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కూల్చివేతపై సీఆర్డీయే ఉన్నతాధికారులు, ఇంజినీర్లు సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు. అవినీతితో అక్రమంగా కట్టిన ప్రజావేదికను కూల్చేయాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ప్రజావేదికలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చేస్తామన్నారు. ప్రజావేదిక నుంచే అక్రమ కట్టడాల కూల్చివేత మొదలవుతుందన్నారు. ప్రజావేదికలో ఇదే చివరి సమావేశం అన్నారు. అవినీతి ఏ విధంగా జరిగిందో చెప్పడానికే ప్రజా వేదికలో సమావేశం పెట్టానన్నారు. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిపోయిందో చెప్పడానికే ఇక్కడ సమావేశం నిర్వహించానని సీఎం జగన్ అన్నారు.