సినిమా ఫ్లాప్.. హిమాలయాలకు దర్శకుడు !

సినిమా ఫ్లాప్.. హిమాలయాలకు దర్శకుడు !

సినిమా ఫ్లాపైతే ఏ దర్శకుడికైనా బాధగానే ఉంటుంది.  మరీ సున్నిత మనస్కులైట్ ఇంకొన్ని రోజులు ఎక్కువ బాధపడతారు.  కానీ ఇక్కడో యువ దర్శకుడు మాత్రం సినిమా పరాజయంగా నిలవడంతో హిమాలయాలు పిలుస్తున్నాయంటూ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నాడు. 

వివరాల్లోకి వెళితే కొన్ని రోజుల క్రితం విడుదలైన నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబుల మల్టీ స్టారర్ సినిమా 'వీర భోగ వసంత రాయలు' ప్రేక్షకులకు నచ్చలేదు.  విమర్శకులు చాలామంది నుండి నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి.  దీంతో నొచ్చుకున్న ఆ చిత్ర దర్శకుడు ఇంద్రసేన్ నెగెటివ్ రివ్యూలు ఇచ్చినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అయినట్టు కాదు.  నాది కల్ట్ పిక్చర్.  ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది.  సో ప్రస్తుతానికి వెళ్ళిపోతున్నాను.  చేయాల్సిన మంచి పనులున్నాయి.  హిమాలయాలు నన్ను పిలుస్తున్నాయి అంటూ తాత్కాలిక సెలవు ప్రకటించాడు.