వెల్లూర్ లోక్ సభ ఎన్నికలు రద్దు చేసిన ఎన్నికల సంఘం

వెల్లూర్ లోక్ సభ ఎన్నికలు రద్దు చేసిన ఎన్నికల సంఘం

ఏప్రిల్ 14న రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన సిఫార్సు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం తమిళనాడులోని వెల్లూర్ లోక్ సభ స్థానం ఎన్నికను రద్దు చేసింది. మరో రెండు రోజుల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్నిక రద్దు చేయాలనే ప్రతిపాదనను ఎన్నికల సంఘం భారత రాష్ట్రపతి ముందుంచింది. దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా అంగీకరించడంతో వెల్లూర్ లోక్ సభ స్థానానికి ఎన్నికలు రద్దయ్యాయి. 

ఈ నెల 18న ఎన్నికలు జరగాల్సిన తమిళనాడు వెల్లోర్ లోక్ సభ నియోజకవర్గంలో సంచుల కొద్దీ డబ్బు పట్టుబడింది. ఈ నియోజకవర్గంలో ధన ప్రవాహం ఎక్కువగా ఉందని అందువల్ల ఎన్నికలు రద్దు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీకి సిఫార్సు చేసింది. ఈ నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి ఇంట్లో సంచుల నిండా కుక్కి ఉన్న డబ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డీఎంకే నేతలకు చెందిన సిమెంట్ గోడౌన్ నుంచి ఐటీ అధికారులు దాదాపు రూ.12 కోట్లు సీజ్ చేశారు.