అమ్మలు, అక్కలు అని తిట్టుకుంటున్నారు !

అమ్మలు, అక్కలు అని తిట్టుకుంటున్నారు !


చట్ట సభల్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. అది చట్ట సభ అని కూడా ఆలోచించకుండా నాయకులు వాడుతున్న భాష గర్హనీయం. ప్రత్యర్ధులను విమర్శించడానికి అధికార ప్రతిపక్షాలు తేడా లేకుండా నాయకులు వాడుతున్న భాష ఈ మధ్య ఆందోళన, జుగుప్స కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం విశాఖలో  ప్రొఫెసర్‌ కోనేరు రామకృష్ణ జీవితం ఆధారంగా రచించిన ‘ఏ ఛైల్డ్‌ ఆఫ్‌ డెస్టినీ ఆన్‌ ఆటో బయోగ్రఫీ’ పుస్తకాన్ని విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ అమ్మ, అక్క అనే పదాలు పవిత్రమైనవని, కానీ అసెంబ్లీలలో నాయకులు వారిని అవమానించేలా మాట్లాడుతున్నారని, చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలనీ చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. కోట్లమంది చట్ట సభల్లో జరుగుతున్న తీరును చూసి ఏం నేర్చుకోవాలని ఆయన ప్రశ్నించారు.