ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో సైరా సందడి..!! 

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంట్లో సైరా సందడి..!! 

మెగాస్టార్ చిరంజీవి సైనా సినిమాను జాతీయ స్థాయిలో ప్రమోషన్ చేసేందుకు చిరంజీవి నడుం బిగించిన సంగతి తెలిసిందే.  మెగాస్టార్ ఈ సినిమాను భారత ప్రధాని, మంత్రులు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి చూపించేందుకు ఢిల్లీవెళ్లారు.  ఢిల్లీలో మొదట మోడీ, అమిత్ షాలను కలిసి సైరా సినిమా చూడాలని కోరినట్టు సమాచారం.  

అనంతరం తెలుగు ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిని మెగాస్టార్ చిరంజీవి కలిశారు.  ఉపరాష్ట్రపతి ఇంట్లోనే సైరానుప్రత్యేకంగా ప్రదర్శించేందుకు అన్ని అనుమతులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిసిన ఫొటోలో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యాయి. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.