త్రివిక్రమ్ పై నమ్మకముందన్న వెంకీ !

త్రివిక్రమ్ పై నమ్మకముందన్న వెంకీ !

విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం 'ఎఫ్ 2' రేపు విడుదలకానుంది.  ట్రైలర్ బాగుండటంతో సినిమాపై కూడ మంచి అంచనాలున్నాయి.  ఈ సినిమా తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్న వెంకీ ఇన్నాళ్లు సినిమాలెందుకు తగ్గించారనే మాటకు సమాధానం ఇస్తూ నచ్చిన పాత్రలు, కథలు రావడంలేదు.  అందుకే తగ్గించా.  త్రివిక్రమ్ సినిమా ఆగిపోలేదు.  కథ కోసం ఆగాం.  త్రివిక్రమ్ మంచి కథను తీసుకొస్తాడనే నమ్మకం నాకుంది అన్నారు.