వెంకీ, చైతు మల్టీ స్టారర్ మొదలయ్యేది అప్పుడే 

వెంకీ, చైతు మల్టీ స్టారర్ మొదలయ్యేది అప్పుడే 

తెలుగులో మల్టీ స్టారర్స్ కు మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఇద్దరు స్టార్ హీరోలను సంతృప్తి పరుస్తూ కథ ఉంటె చాలు అలాంటి ప్రాజెక్టులు పట్టాలెక్కుతున్నాయి. తాజాగా వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో ఓ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం జరుగుతున్న ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రావడంతో జూలై 11న అధికారికంగా లాంచ్ చేయడానికి ప్లాన్ చేశారు. 

వెంకీ, చైతు మామ అల్లుళ్ళు కాబట్టి వారి శైలికి తగినట్లే ఈ కథను అన్ని అంశాలతో సిద్ధం చేశారట. రచయిత కోనా వెంకట్ కథ సహకారంతో ఈ ప్రాజెక్టు రూపొందనుంది. ఈ ప్రాజెక్టుకు వెంకీ మామ అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్నారు. మరి ఈ ప్రాజెక్టులో వీరిద్దరి సరసన నటించే హీరోయిన్స్ వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. మరోవైపు వెంకీ..వరుణ్ తేజ్ తో మల్టీ స్టారర్ ఎఫ్ 2 లో నటించనున్నాడు.