సైరాతో పోటీకి మామ అల్లుళ్ళు సై..!!

సైరాతో పోటీకి మామ అల్లుళ్ళు సై..!!

మెగాస్టార్ సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  ఇప్పటికే టీజర్ రిలీజ్ చేశారు.  మిగతా కార్యక్రమాలు కూడా త్వరలోనే పూర్తి అవుతాయి.  సినిమా వాయిదా వేయబోతున్నారనే రూమర్స్ కు చెక్ పెడుతూ సినిమా రిలీజ్ ను అక్టోబర్ 2న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. బిజినెస్ పరంగా కూడా ఈ మూవీ ఇప్పటికే భారీ ఎత్తున జరిగింది.  

ఈనెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.  సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 20 వరకు చిన్న, మీడియం సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  అక్టోబర్ 2 వ తేదీన తెలుగులో సైరా, వార్ తప్పించి మరో సినిమా రిలీజ్ కావడం లేదు. అక్టోబర్ 8 వతేదీన దసరా కావడంతో.. వరసగా సెలవులు ఉంటాయి.  ఈ సెలవులను సైరా వాడుకోవాలని అనుకుంటోంది.  అయితే, భీష్మా సినిమా కూడా దసరాకు రావాలి అనుకున్నా దాన్ని, అక్టోబర్ 18 కి వాయిదా వేసినట్టు తెలుస్తోంది.  అయితే, దసరాకు సైరా ఒక్కటే వస్తున్నది. దీంతో ఓ వారం గ్యాప్ తో వెంకిమామ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.  డేట్ విషయం ఇంకా కన్ఫర్మ్ కాకపోయినా..దసరాకు మామ అల్లుళ్ళు రావడం ఖాయం అని తెలుస్తోంది.